విశాఖ: లాటరీ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ షాపుల కేటాయింపు

ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెదగంట్యాడ, సిరిపురం షాపింగ్ కాంప్లెక్స్‌లలోని షాపులను మంగళవారం జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి సమక్షంలో పారదర్శకంగా లాటరీ ద్వారా కేటాయించారు. జీవో నెం. 26 నిబంధనల మేరకు అర్హులైన అభ్యర్థుల మధ్య లాటరీ నిర్వహించి మొత్తం 6 మందికి షాపులు మంజూరు చేశారు. పెదగంట్యాడ షాపింగ్ కాంప్లెక్స్‌లోని 5 షాపుల కోసం 47 దరఖాస్తులు రాగా, అర్హత సాధించిన 32 మందిలో లాటరీ నిర్వహించి ఐదుగురిని ఎంపిక చేశారు. అలాగే సిరిపురం షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఒక దుకాణాన్ని ఓపెన్ కేటగిరీ కింద లాటరీ ద్వారా కేటాయించారు. ఈ ప్రక్రియలో డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, సామాజిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్