విశాఖ: లడ్డూపై అసత్య ప్రచారాలకు క్షమాపణ చెప్పాలి

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జతకట్టడం రాష్ట్రానికి అరిష్టమని విమర్శించారు. శనివారం విశాఖలోని అల్లిపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించి, కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి నేతల అసత్య ప్రచారాలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, గీతం యూనివర్సిటీకి 54 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయడం చట్టవిరుద్ధమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్