విశాఖ జిల్లాలో 2, 543 మందికి కొత్తగా ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు మంజూరయ్యాయి. ఇందులో ఏప్రిల్ 2019 నుంచి పింఛను పొందుతూ మరణించిన వారి భార్యలకు 2, 524 వితంతు పింఛన్లు, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న 19 మందికి ప్రత్యేక పింఛన్లు ఉన్నాయి. వీరందరికీ కలిపి రూ. 1. 03 కోట్లు విడుదలయ్యాయని గురువారం కలెక్టర్ హరేందిరప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీరిందరికీ శుక్రవారం పంపిణీ చేస్తామన్నారు.