విశాఖ: ఏఎస్‌ఐపీ ఒక బోగస్ కంపెనీ: వైసీపీ

రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో రూ. 1500 కోట్ల విలువైన భూములను ఏఎస్‌ఐపీ అనే బోగస్ కంపెనీకి కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. కేవలం 40 మంది ఉద్యోగులున్న, అర్హతలు లేని సంస్థకు ఇంత భారీ భూకేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ అబద్ధాలతోనే నిండి ఉందని, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేయడమే ఆయన లక్ష్యమని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్