ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ప్రపంచస్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏయూను దేశంలో టాప్-5, ప్రపంచస్థాయిలో టాప్-100 యూనివర్సిటీల జాబితాలో చేర్చడమే లక్ష్యంగా రూ. 500 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు, పూర్వ విద్యార్థుల సహకారంతో మరో రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉద్యోగార్థులుగా కాకుండా, ఎంట్రప్రెన్యూర్లుగా ఎదగాలని, ఏఐ, క్వాంటం వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించాలని సూచించారు.