విశాఖ: శానిటరీ వర్కర్లకు అవగాహన

విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 27, 29 వార్డుల శానిటరీ వర్కర్లకు 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా మంగళవారం కెపాసిటీ బిల్డింగ్ శిక్షణా కార్యక్రమం జరిగింది. రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చ రామురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, భద్రతా జాగ్రత్తలు, ఆధునిక పారిశుధ్య విధివిధానాలపై వర్కర్లకు దిశానిర్దేశం చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర కీలకమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్