విశాఖ‌: డాబాగార్డెన్స్‌లో బిగ్ బాస్ విన్నర్ సందడి

విశాఖపట్నం నగరంలోని డాబాగార్డెన్స్ ప్రధాన రహదారిపై ఉన్న లక్కీ షాపింగ్ మాల్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో బిగ్ బాస్ విజేత కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయనను చూడటానికి అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో రోడ్డుపై తీవ్ర రద్దీ ఏర్పడి, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో డాబాగార్డెన్స్ నడిరోడ్డుపై ట్రాఫిక్ స్తంభించి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

సంబంధిత పోస్ట్