విశాఖలోని వాంబే కాలనీ రెండో బస్సు స్టాప్ జంక్షన్ వద్ద విద్యుత్ స్తంభానికి ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లు సోమవారం అర్ధరాత్రి దగ్ధమయ్యాయి. మంగళవారం ఉదయం కాలిన వైర్లు రహదారిపై వేలాడటంతో ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. అయితే చెట్టు కొమ్మలు పచ్చిగానే ఉండటంతో మంట వాటిని తాకలేదని స్థానికులు తెలిపారు.