విశాఖ‌: జ‌ర్న‌లిస్టుల హక్కుల కోసం మార్చి 4న 'చలో విజయవాడ'

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 4న 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి. నారాయణ పిలుపునిచ్చారు. శనివారం విశాఖ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్ పునరుద్ధరణ, పెన్షన్ విధానం, మీడియా కమిషన్ ఏర్పాటు వంటి 11 ప్రధాన డిమాండ్ల సాధన లక్ష్యంగా ఈ పోరాటం సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్