విశాఖ: 'జగన్‌ అంటే చంద్రబాబుకు భయం'

చిత్తూరు జిల్లాలో రోడ్డున పడ్డ మామిడి రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వైసీపీ అధినేత వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై కూటమి నేతలు ఎందుకు కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే చంద్రబాబుకు ఎందుకంత భయమని ఆయన నిలదీశారు. గురువారం ఆశీల్‌మెట్ట పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లడారు.

సంబంధిత పోస్ట్