విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హెరిటేజ్-లెగసీ ఫోటో ఎగ్జిబిషన్‌ను నగరవాసులకు రెండు రోజుల పాటు అందుబాటులో ఉంచారు. 1926 నుంచి నేటి వరకు జరిగిన ముఖ్య ఘట్టాలు, ప్రముఖుల సందర్శనలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు ముందస్తుగా వీక్షించారు.