విశాఖ జిల్లాలోని 321 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 49 వేల మంది విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ బార్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. మంగళవారం అక్కయ్యపాలెం ఎన్జీజిఓస్ కోలనీలోని జివిఎంసి హైస్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం మాట్లాడుతూ, పౌష్టికాహారంతోనే పిల్లల్లో సంపూర్ణ విద్య సాకారమవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి వరకు ప్రతీ మంగళవారం, గురువారం, శనివారాల్లో ఉదయం పూట పాఠశాలల్లో ఈ చిరు ధాన్యాలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.