విశాఖ‌: దక్షిణ కోస్తా పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక

నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'దిత్వా' తుఫాన్ రాగల 24 గంటల్లో తమిళనాడు-దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా ప్రయాణించనుంది. దీని ప్రభావంతో సోమవారం దక్షిణ కోస్తాలో 60 కి. మీ. వేగంతో గాలులు, భారీ వర్షాలు ఉంటాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గుంటూరు సహా 6 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది. దక్షిణ కోస్తా పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాధ కుమార్ సోమవారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్