విశాఖ: వి-పుల్’ ద్వారా కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధి

బ్లూమ్‌బర్గ్ ఫిలాంత్రపీస్ ‘మేయర్స్ ఛాలెంజ్’లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 24 నగరాల్లో విశాఖ ఒకటిగా నిలిచింది. ‘వి-పుల్’ (విశాఖ-ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్) ద్వారా నగరంలోని కమ్యూనిటీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం 19వ వార్డు శివ గణేష్ నగర్, వాసవానిపాలెం ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, స్థానిక మత్స్యకార కుటుంబాలతో మాట్లాడి మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణపై చర్చించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, గ్రీన్ బెల్ట్ ఏర్పాటు వంటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పర్యటన అనంతరం కమిషనర్ స్థానికులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు.

సంబంధిత పోస్ట్