విశాఖ పరిధిలో చేపడుతున్న రోడ్డు, కల్వర్ట్లు, కాలువలు, ఫుట్ పాత్ లు, తదితర అభివృద్ధి పనులు ఇంజనీరింగ్ అధికారులు సూక్ష్మంగా పరిశీలించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సన్ బీచ్ కాలేజీ రోడ్డు నుండి వై ఎల్ పి లేఔట్ మీదుగా ఎండాడ వరకు అభివృద్ధి పరిచిన రోడ్డును, విస్తరణ రోడ్డును ప్రధాన ఇంజనీర్ పల్లమరాజు, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి తో కలిసి పరిశీలించారు.