విశాఖ: రక్తదానంతో ప్రాణదానం

ఆదివారం, డాక్టర్ వాసుపల్లి రవి ఆధ్వర్యంలో సాగరదుర్గ ఆసుపత్రి వద్ద తలసేమియా బాధితుల కోసం ఒక మెగా రక్తదాన శిబిరం జరిగింది. విశాఖ దక్షిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, వేసవిలో రక్తం కొరతను అధిగమించడానికి ఇలాంటి శిబిరాలు చాలా అవసరమని, తలసేమియా పిల్లల ప్రాణాలను కాపాడటానికి యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఎండీ కృష్ణ, వైఎస్ఆర్సిపి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్