విశాఖ‌: ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కల సాకారం: బీజేపీ హర్షం

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అని, దీనిని సాకారం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని ఆ పార్టీ నేతలు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి, పీవీఎన్ మాధ‌వ్ స్పష్టం చేశారు. విభజన చట్టంలో కేవలం పరిశీలన అని మాత్రమే ఉన్నప్పటికీ, పార్లమెంటులో పోరాడి జోన్‌ను సాధించుకున్నామని గుర్తుచేశారు. రైల్వే జోన్ కార్యాలయం కోసం విశాఖలో 52. 25 ఎకరాలు కేటాయించామని, భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాకతో కొత్తవలస స్టేషన్ భవిష్యత్తులో కీలక జంక్షన్‌గా మారుతుందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 87 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

సంబంధిత పోస్ట్