ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2026 జనవరి 23 నుండి 31 వరకు విశాఖ తీరంలో తొమ్మిది రోజుల పాటు విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్) అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ వివరాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆర్థిక అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు. విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, ఈ ఉత్సవాలలో ఫుడ్ ఫెస్టివల్స్, సాంస్కృతిక ప్రదర్శనలు, సాహస క్రీడలు వంటి భారీ వినోద కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు.