విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్డులోని రాధ బీచ్ అపార్ట్‌మెంట్ 6వ అంతస్తులో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. నోవాటెల్ హోటల్ సమీపంలోని ఈ అపార్ట్‌మెంట్‌లో, 70 ఏళ్ల వృద్ధురాలు పూజ గదిలో దీపం వెలిగిస్తుండగా అది కిందపడి మంటలు చెలరేగినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కేవలం ఆ ప్లాట్‌కు మాత్రమే నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.