విశాఖ జీవీఎంసీ విశ్రాంత చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కూరెళ్ల సాయి లక్ష్మీ గణపతి శాస్త్రి శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణంపై జీవీఎంసీ మేయర్, కమిషనర్ సహా పలువురు అధికారులు శనివారం సంతాపం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలకు అహర్నిశలు సేవలందించిన శాస్త్రి సేవలను ప్రముఖులు స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.