ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద, మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న టీఈడీ (తాబేలు తప్పించుకునే పరికరం) వలలను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ శనివారం శివాజిపాలెంలోని తన క్యాంప్ కార్యాలయంలో మెకనైజ్డ్ బోటు యజమానులకు పంపిణీ చేశారు. సముద్ర జీవవైవిధ్య పరిరక్షణతో పాటు మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.