విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 33వ వార్డులో గల శ్రీ శ్రీ శ్రీ నీలమ్మ వేపచెట్టు అమ్మవారి ఆలయం, శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారల ఆలయాల నూతన ధర్మకర్తల మండళ్ల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన చైర్మన్లు, బోర్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆలయాల అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పాలక మండలి సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.