విశాఖ: ఏపీ అవతరణ దినోత్సవంపై ప్రభుత్వం నిర్లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా విశాఖ మద్దిలపాలెం కూడలి వద్ద తెలుగుదండు ఆధ్వర్యంలో "తెలుగుతల్లికి నీరాజనం" కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి, ప్రభుత్వం ఈ సంవత్సరమైనా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలుగుదండు ప్రభుత్వాన్ని కోరింది.

సంబంధిత పోస్ట్