విశాఖ: గంద‌ర‌గోళంగా జీవీఎంసీ కౌన్సిల్ స‌మావేశం

శుక్రవారం విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య రసాభాసగా మారింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ శ్రీభరత్ కు చెందిన గీతం సంస్థల భూ దోపిడీని అడ్డుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఎంపీ హోదాలో ప్రభుత్వ భూములను ఆక్రమించడం ఏంటని ప్రశ్నిస్తూ, భూ క్రమబద్ధీకరణ అజెండాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియాను అనుమతించకపోవడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్