సింహాచలం గిరి ప్రదక్షిణకు భక్తులు అధిక సంఖ్యలో పోటేత్తారు. భారీగా వాహానాల రద్దీ కూడా పెరిగపోయింది. ఈ క్రమంలో వేపగుంట కూడలిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాల సంఖ్య అధికంగా ఉండటంతో ఎటువెళ్లాలో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేపగుంట నుంచి నాయుడుతోట, చేములపల్లితో పాటు పెందుర్తి రోడ్డులో కృష్ణరాయపురం వరకు వాహనాలు నిలిచిపోయాయి.