విశాఖ: కుమారుడి వివాహానికి ఆహ్వానం

విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ద్వితీయ కుమారుడు గోవింద సాకేత్ వివాహ మహోత్సవానికి రావాలని కోరుతూ, వివాహ ఆహ్వాన పత్రికను జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా జగన్, వివాహానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాసుపల్లి గణేష్ కుమార్, సతీమణి ఉషారాణి, పెద్ద కుమారుడు సూర్య, కోడలు రాశి, కుమారుడు గోవింద సాకేత్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్