ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని దేశంలోనే అత్యంత అందమైన నగరంగా అభివర్ణించారు. శుక్రవారం విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. విశాఖను సురక్షితమైన నగరంగా కేంద్రం ప్రకటించిందని, ఆంధ్రప్రదేశ్ దేశానికి గేట్‌వేగా మారుతోందని, పెట్టుబడిదారుల లక్ష్యంగా రాష్ట్రం ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని మోదీ పరిపాలనపై ప్రజలకు విశ్వాసం ఉందని చంద్రబాబు అన్నారు.