విశాఖ‌: వాసుపల్లి నివాసంలో జ‌గ‌న్‌

విశాఖ పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బుధవారం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసానికి వెళ్లి, ఇటీవల వివాహం చేసుకున్న వాసుపల్లి రెండో కుమారుడు సాకేత్, కోడలు శ్రావణిలకు ప్రత్యేకంగా వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్‌కు కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కలయిక స్థానికంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

సంబంధిత పోస్ట్