వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధం విధించినా ప్రజల నుంచి జగన్‌ను వేరు చేయలేరని ఆమె స్పష్టం చేశారు.