విశాఖ: క్రిమినల్స్‌కు జగన్ మద్దతు ఇస్తున్నారు: హోంమంత్రి అనిత

జగన్ నెల్లూరు పర్యటనపై హోంమంత్రి అనిత గురువారం మీడియాతో మాట్లాడారు. జగన్ పర్యటనపై వైసీపీ సరైన సమాచారం ఇవ్వట్లేదని, సమాచారం ఇస్తే దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక జైలులో ఉన్న గంజాయి బృందాలు, నేరస్తులతో జగన్ కలుసుకుంటున్నారని అనిత విమర్శించారు. క్రిమినల్స్‌కు జగన్ మద్దతు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. వైసీపీ నేతలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు భార్యపై కూడా అసభ్యంగా మాట్లాడారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్