తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. మొత్తం పది మంది సభ్యులకు 21 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, జనసేన నుంచి సాధిక్ ఒక్కరే ఉన్నారు. ఆయనా పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. జనసేనకు కనీసం ముగ్గురు సభ్యులు కేటాయించాలని కోరగా టీడీపీ అంగీకరించలేదు.