విశాఖ: నేడు ఏయూలో జాబ్ మేళా

విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ కెరీర్ గైడెన్స్ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ దొరబాబు బుధవారం తెలిపారు. ఆరు ప్రధాన కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని చెప్పారు. ఈ జాబ్ మేళాలో సుమారు 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గురువారం ఉదయం 10:30 గంటలకు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో ఏయూ కెరీర్ గైడెన్స్ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్