ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ, కింగ్ జార్జ్ హాస్పిటల్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 71 ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ విధానంలో నియామకాలకు ఇది మంచి అవకాశం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు visakhapatnam.ap.gov.in లేదా www.amc.edu.in నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు శుక్రవారం తెలిపారు.