విశాఖ: విద్యార్థులతో పెట్టకుంటే రాజ్యాలే కూలిపోయాయి

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులు, యువతతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయని ఆయన అన్నారు. ఎన్నికల హామీలైన నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 'సూపర్ సిక్స్' పేరుతో ప్రజలను మోసం చేసిన కూటమికి విద్యార్థులు గుణపాఠం చెబుతారని తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆసీలమెట్ట కార్యాలయంలో కొంతమంది యువత వైఎస్సార్‌సీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్