కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థల కోసం కార్మికుల హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని సిఐటియు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎ. అజశర్మ అన్నారు. విశాఖలో జరిగిన రక్షణ రంగ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు సమ్మె చేసే, సంఘం పెట్టుకునే హక్కులు సైతం లేకుండా పోతున్నాయని ఆరోపించారు.