విశాఖలోని ఇసుకకొండపై కొలువై ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఆదివారం మాఘ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. తెల్లవారుజామున 2 గంటలకే ఆలయ తలుపులు తెరిచి, 4 గంటలకు ధ్వజస్తంభ పూజలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనం కోసం ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుందని ఈఓ టి. రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కేజీహెచ్ వైపు నుండి ఆలయ మార్గం మూసివేసినందున, భక్తులు పూర్ణా మార్కెట్ దయారామ్ స్వీట్స్ వద్ద ఉన్న నూతన ఘాట్ రోడ్డు ద్వారా రావాలని ప్రధాన అర్చకులు పి. నరశింహమూర్తి సూచించారు.