విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం 42వ వార్డు పరిధిలో ఉన్న చాకలిపేట, ఎర్రగెడ్డ, కోళ్ల ఫామ్ బ్రిడ్జ్ , దొండపర్తి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చాకలిగడ్డ ప్రాంతంలో వర్షపు నీరు అధికంగా చేరుకోవడంపై గల సమస్యలను చర్చించారు. చాకలి గెడ్డ ప్రాంతంలో ఉన్న గోడ నిర్మాణం వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.