జీవీఎంసీ 42వ వార్డులో మౌలిక సదుపాయాలపై దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం స్థానిక అధికారులతో కలిసి పర్యటించి సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల అభ్యర్థనలు స్వయంగా తెలుసుకొని తక్షణ పరిష్కారం ఇవ్వాలన్నారు.