విద్యా, పరిశోధనా రంగాల్లో సహకారం కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ), ఇథియోపియన్ డిఫెన్స్ యూనివర్సిటీలు గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి. పి. రాజశేఖర్, ఇథియోపియన్ డిఫెన్స్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కేబెడే రెగస్సా గెర్బి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అత్యాధునిక సాంకేతికతలు, శాస్త్రీయ పరిశోధనలు, అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడికి దోహదపడుతుంది. సంయుక్త వర్క్‌షాప్‌లు, అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్‌లు, ప్రాక్టికల్ శిక్షణ అందించాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి.