విశాఖ: వైసీపీలో చేరిన ముస్లిం యువత

విశాఖ దక్షిణ నియోజకవర్గ 38వ వార్డులో గురజాపు రవి ఆధ్వర్యంలో 'ఫిరోజ్ టీమ్' మరియు ముస్లిం యువత ఆదివారం వైఎస్ఆర్సిపిలో చేరారు. ఆసీలమెట్టలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో యువత నిరాశలో ఉందని, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో కేవలం తన వర్గానికి, తన కుమారుడికి మాత్రమే మేలు జరిగిందని, నిరుద్యోగ యువతను విస్మరించారని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్