విశాఖ: నైట్ ఫుడ్ కోర్టును పునరుద్ధరించాలి.. కేకే రాజు

విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద తొలగించిన నైట్ ఫుడ్ కోర్టును తక్షణమే పునఃస్థాపించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మద్దతు తెలిపారు. మంగళవారం దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన, పేద వ్యాపారుల పొట్టకొట్టడం సరికాదని, ఈ సమస్యపై కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లను కలిసి విన్నవిస్తామని, పరిష్కారం లభించకపోతే జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, నాయకులు మొల్లి అప్పారావు, బాణాల శ్రీనివాసరావు, కొండా రాజీవ్ గాంధీ, పళ్ళ దుర్గా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్