విశాఖలోని సెంట్రల్ పార్క్ వద్ద నైట్ ఫుడ్ కోర్టు తొలగించి ఆరు నెలలు గడుస్తున్నా, చిరు వ్యాపారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం మండిపడ్డారు. హామీల అమలు కోసం వ్యాపారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఉపాధి కోల్పోయి ముగ్గురు వ్యాపారులు మరణించారని, కూటమి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని ధ్వజమెత్తారు. కంటైనర్లు ఇస్తామని నమ్మించి పేదలను రోడ్డున పడేశారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తక్షణమే హాకర్ జోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.