రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 36వ వార్డులో ఉత్సాహంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఏవీఎన్ కాలేజీ ఎదురుగా నివసిస్తున్న లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచే నియోజకవర్గ వ్యాప్తంగా పంపిణీని వేగవంతం చేశారు. సచివాలయ సిబ్బంది, కూటమి శ్రేణులు కలిసి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.