విశాఖ: ఏయూ ఉత్సవాల్లో పోలీసుల ఆంక్షలు: విద్యార్థుల నిరసన

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశాఖలో సోమవారం గందరగోళం నెలకొంది. ముఖ్యఅతిథుల ప్రసంగాలు ముగిసి, కార్యక్రమం పూర్తయ్యే వరకు విద్యార్థులను బయటకు వెళ్లనివ్వబోమని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆంక్షలు తప్పవని పోలీసులు చెప్పడంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. గంటల తరబడి లోపలే ఉండటం ఇబ్బందిగా ఉందని, తమకు వెళ్లే హక్కు ఉందని విద్యార్థులు వాదించారు.

సంబంధిత పోస్ట్