విశాఖ: 'పీ-4 తో పేదరిక నిర్మూలన'

రాష్ట్రంలో పేదరికం తొలగించాలనే లక్ష్యంతో పీ- 4 పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శుక్రవారం ఆయన పీ- 4, స్వర్ణాంధ్ర విజన్ 2047 పై ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం విశాఖ కలెక్టరేట్ లో నిర్వహించారు. అనంతరం కలక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్