విశాఖకు చెందిన పద్మశ్రీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు మరో ప్రతిష్టాత్మక పదవి లభించింది. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ హిందీ సలహా సభ్యునిగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం గెజిట్ ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఏర్పడిన ఈ సంఘంలో యార్లగడ్డ మూడేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు. మంత్రిత్వ శాఖలో రాజభాష హిందీకి సంబంధించి ఆయన సలహాలు అందిస్తారు.