విశాఖ: ప్రజా సేవ చేయడం వరంగా భావించాలి

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శుక్రవారం తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. 35వ వార్డులోని గాజుల వీధి వద్ద అబ్దుల్ సమద్ ఖాన్, ఫైజూర్ రెహమాన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, తుఫాన్ వల్ల ఇళ్లకే పరిమితమైన కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారు. ప్రజాసేవ చేయడం గొప్ప వరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్