విశాఖ: రేపు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో

జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 1,89,712 మంది ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 1,062 పోలియో బూత్‌లు, 62 ట్రాన్సిట్ బూత్‌లు, 94 మొబైల్ బూత్‌లను ఏర్పాటు చేశారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణంలో ఉండే చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్