విశాఖ: కనకమహాలక్ష్మి ఆలయంలో అ‍న్నదానం నాణ్యత పరిశీలన

శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ డా. కందుల నాగరాజు ఆలయ పర్యటనలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక అభిషేకంలో పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా ప్రసాదాలు పంపిణీ చేసిన ఆయన, ఆలయ వంటశాల, ప్రసాద తయారీ కేంద్రాలను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేశారు. అన్నప్రసాద క్షేత్రంలో భక్తులతో మాట్లాడి దర్శన, భోజన ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెరుగైన సేవలందించే చైర్మన్ కృషిని భక్తులు ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్