విశాఖ‌: చంద్రబాబు డైరెక్షన్‌లోనే రాధాకృష్ణ వ్యాఖ్యలు

ఏబీఎన్ రాధాకృష్ణ మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి, టీడీపీ నేతలు ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేయడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. ఈ వ్యాఖ్యలన్నీ చంద్రబాబు నాయుడి డైరెక్షన్‌లోనే జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం దారుణమని, ఇలాంటి చర్యలను మహిళా లోకం క్షమించదని ఆమె హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్